Jr NTR Pet Dog | టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి పట్ల ఆయన తీవ్ర వేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన పెంపుడు నేస్తాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
‘బఘీరా.. నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు మిగిల్చిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ బఘీరా. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నువ్వు ఎప్పుడూ లోతుగా ప్రేమించబడ్డావు, అలాగే ఎప్పటికీ ఉంటావు’ అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
ఎన్టీఆర్ షేర్ చేసిన ఫోటోలలో ఆయన బఘీరాతో గడిపిన క్షణాలు, దాన్ని ప్రేమగా హగ్ చేసుకున్న దృశ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఫోటోలో బఘీరా జ్ఞాపకార్థం దాని సమాధి వద్ద లేదా ప్రాంగణంలో ఒక చిన్న మొక్కను నాటిన దృశ్యం అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. కాగా, ఇటీవల భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్న ఎన్టీఆర్కు, తన పెంపుడు కుక్క మరణం మరింత బాధను మిగిల్చింది. ఈ వార్త తెలిసిన అభిమానులు మరియు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్కు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
View this post on Instagram