హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): పాత ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆ శాఖ ప్రీ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించా రు. ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, ఏఎమ్మార్పీలో ఐదో పంపు ఏర్పాటుచేసే పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. సీతారామ, బస్వాపూర్, డిండి తదితర ప్రాజెక్టుల పూర్తిపై దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు తదితరులున్నారు.