వ్యవసాయ శాఖ అధికారులకు రుణమాఫీ సెగ తగిలింది. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీపై అధికారులను రైతులు నిలదీశారు.
వచ్చే వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నందున పంట రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సూచించారు.