హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో ఏఐ సాంకేతికతను వినియోగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సచివాలయం లో ఆ శాఖ సెక్రటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, పలు సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీడపీడలపై రైతులను అలర్ట్ చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటనష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆదేశించారు.