హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): విత్తన కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సూచించారు. గురువారం సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదును పంటకాలం పూర్తయ్యే వరకు దాచుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాలు పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.