సిద్దిపేట, మే 28 : సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విధి నిర్వహణలో లింగ వివక్షత చూపడం, ప్రభుత్వ ఉద్యోగిగా అతనిపై అనేక ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.