హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పథకాన్ని పునరుద్ధరించడానికి కావల్సిన నిధులు, పథకం అమలుపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, సహాకార సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని డైరెక్టర్ గోపి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెట్లోకి వచ్చిన పరికరాలపై రైతులకు అవగాహన కల్పించేందు కు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఎగ్జిబిషన్‌కు రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.