రాష్ర్టానికి 11,930 టన్నుల యూరియా
రాష్ర్టానికి శుక్రవారం 11,930 టన్ను ల యూరియా వచ్చిందని, గత రెండు రోజు ల్లో 23వేల టన్నులు చేరుకుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- నేడు రేక్ పాయింట్ల నుంచి జిల్లాలకు సరఫరా: మంత్రి తుమ్మల
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ): రాష్ర్టానికి శుక్రవారం 11,930 టన్ను ల యూరియా వచ్చిందని, గత రెండు రోజు ల్లో 23వేల టన్నులు చేరుకుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరో 4 రోజుల్లో రాష్ర్టానికి 27,650 టన్నుల యూరియా అందుబాటులోకి రానుందని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఇక్రిశాట్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం యూరియా సరఫరాపై వ్యవసాయశాఖ సెక్రెటరీ రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రానికి వివిధ ఎరువుల కంపెనీల నుంచి 11 రేకులు రవాణాలో ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరగా జిల్లాలకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

