2014లో అధికారంలోకి రావడానికి ముందు నరేంద్ర మోదీ రైతులపై ఎన్నో హామీలు కురిపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు.
ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. ఫలితంగా వచ్చే వానకాలం సీజన్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (ప్రధానమంత్రి పంటల బీమా పథకం) అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం రైతులకేమో గానీ బీమా కంపెనీలకు మాత్రం ఆదాయ వనరుగా మారింది. ప్రధాని మోదీ దేశ రైతాంగం మేలు కోసం ఈ పథకాన్ని 2016, ఫిబ్రవరి 18న ప్రారంభించారు.