Telangana | పంట నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
Telangana | హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను( Farmers ) తప్పకుండా ఆదుకుంటామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLC Palla Rajeshwar Reddy ) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ( BRSLP ) లో ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, సండ్ర వెంకట వీరయ్య, గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Telangana | హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను( Farmers ) తప్పకుండా ఆదుకుంటామని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLC Palla Rajeshwar Reddy ) స్పష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీ( BRSLP ) లో ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, సండ్ర వెంకట వీరయ్య, గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కేంద్రం ఎలాంటి సహాయం చేయకున్నా రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు. పంట నష్టం అంచనాలు పూర్తయ్యాక రైతులను తప్పకుండా తప్పకుండా ఆదుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి బృందాలను పంపించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందన్నారు. పంట నష్టంపై గతంలో కేంద్రానికి ఎన్నిసార్లు అంచనాలు పంపినా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాలకు కేంద్రం ఏ రకంగానూ సహాయపడటం లేదన్నారు. కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజనతో రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు. ఫసల్ బీమా యోజనతో రైతులకు నష్టం.. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతుందన్నారు. ఈ పథకం స్థానంలో కేంద్రం కొత్త పాలసీని తేవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

