ఆ నీచుడు తమరి మేనల్లుడు అయినందుకు మేము ఆశ్చర్యపోతున్నాం జాయచోడదేవా!” అన్నాడు రాయడు. “క్షమించాలి నందనరాయా! మురారిదేవుని తప్పు ఏమిటో మీరు చెప్పలేదు. మహామండలేశ్వరులు శ్రీ గణపతిదేవుల సంతానం మురారిదేవుడు.
మఠియవాడ.. మఠియలు అంటే చిన్నచిన్న అంగళ్లు. అక్కడ తినుబండారాలు ప్రసిద్ధి. నాలుగైదు వీధులతో విస్తరించి ఉంది మఠియవాడ. మఠియల ముందు అమ్మకాలు, వెనుక వసారాలో వంట.. ఘుమఘుమలు, వాటివెంట పిడకల పొగ.. వీధులన్నిటినీ చుట్ట�
జీవితం.. కనీసపు శారీరకతృష్ణ కూడా తీరని ఓ ఎండిన మోడుగానే బతుకు ముగిసిపోతుందా!? నీలాంబక్కను తల్పంపై అలా చూసేసరికి ఆరోజు లలితాంబ చేతిని తన గుండెకు తాకించడం తప్పయిందా?.. అప్పటికే తమమధ్య ఆమె కోరుకున్న భోగినీ పం�
ఓ ఎనభై ఏళ్ల పండితుడు అడిగాడు చొంగ తుడుచుకుంటూ, “లలితాంబా! నిత్యమూ ఇక్కడికి వస్తుంటే నీ వేశ్యాగృహ నిర్వహణ ఎలా..?” “మామ ఎక్కడుంటే అదే నాగృహం. ఏం మామా..” అన్నది గారంగా.ఎంత గారంగా అన్నదంటే.. కొన్ని లిప్తల కాలం ఎవ్�
తనతో వివాహ ప్రతిపాదనను ఇంద్రాణి విరమించుకున్నట్లు తెలిసి.. జాయపుడికి క్షణకాలం ఏమీ అర్థంకాలేదు. ముమ్మడి.. ఇలా తనపై పైచేయి సాధించాడా!? అంతలోనే.. నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు తగులబెట్టినట్లు వార్త. పరు�
ఇద్దరూ ఓ అశ్వంపై వెళ్లడం.. ఇద్దరికీ కొత్త అనుభవం.ఆ దగ్గరితనం శిల్పభంగిమల కంటే మరింత సన్నిహితంగా ఉంది. శిల్పశాలలో పనిపూర్తయ్యాక ఆ రాత్రి ఇద్దరూ పురనివాసం వద్దకు వచ్చారు.