సంగారెడ్డి జిల్లాలో చలితీవ్రత పెరిగింది. శనివారం రాష్ట్రంలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కోహీర్లో 6.0 డిగ్రీలుగా నమోదైంది.
వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతున్నది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున