యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలో గురువారం తొలి ఏకాదశి సందడి నెలకొన్నది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.