ఇంటర్ పరీక్షల్లో బుధవారం బోటనీలో రెండు, గణితంలో ఒక ప్రశ్న చొప్పున తప్పులు దొర్లాయి. బోటనీలో 5,7 ప్రశ్నల్లో తప్పులు రాగా, గణితంలో 4వ ప్రశ్న తప్పుగా ఇచ్చారు.
వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడగించింది. రూ.4 వేల ఆలస్య రుసుంతో ఈనెల 29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ తెలిపారు.
ఇంటర్ వార్షిక పరీక్షల సందర్భంగా కొంత మంది ఆకతాయిలు ఫేక్కాల్స్ చేస్తూ అధికారులు, స్కాడ్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు సమాచారాన్నిస్తూ అధికారులను టెన్షన్ పెడుతున్నారు.