సైదాపూర్ : తండ్రి చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసాడు ఇంటర్ విద్యార్ధి. మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన బూర్గుల అభిరామ్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సుమారు నెల క్రింద అభిరామ్ తండ్రి రాజేశ్వర్ రావు మానకొండూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా కుటుంబ సభ్యులు కరీంనగర్ కు అక్కడ నుండి హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించారు.
కాగా, చికిత్స పొందుతూ రాజేశ్వర్ రావు మంగళవారం రాత్రి మృతి చెందాడు. కాగా మృతుడి కుమారుడు అభిరామ్ తండ్రి మరణంతో తీవ్రంగా కలత చెంది బోరున విలపించారు. బుధవారం ఇంటర్ పరీక్ష ఉండడం తో కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం తండ్రి అంత్యక్రియలు చేశాడు.