భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లను నరికివేశారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో చెట్లు నరికివేశారు.
రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని జంబికుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలోని జంబికుం ట గ్రామానికి వెళ్లే రహదారి ఎన్హెచ్ 161 కు కిలోమీటర్ ఉంటుంది.
“మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి” అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే , మొక్కల పాలిట శాపంగా మారారు.
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొక్కలను నాటి అవి ఏపుగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు తీసుకున్నది.
రాష్ట్రంలోని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు.