ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మొక్కలను నాటి అవి ఏపుగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు తీసుకున్నది. ముళ్లకంచెలు వేసి మొక్కలు పశువులకు మేతగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ప్రస్తుతం హరితహారంపై నిర్లక్ష్యపు నీడలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అందుకు డిచ్పల్లి మండలం దేవానగర్ క్యాంప్‌లో కనిపిస్తున్న కొయ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో మొక్కలు పశువులకు మేతగా మారాయి. మొక్కల సంరక్షణ పట్టించుకోకపోవడంతో కనుమరుగవుతున్నాయి.