రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచింది. ఎంబీఏలో 3,060, ఎంసీఏలో 2,700 కొత్త సీట్లకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలకు గ్రేడింగ్ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులు యోచిస్తున్నారు. న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రస్థాయిలో గ్రేడ్లు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.