దేవీ శరన్నవరాత్రోత్సవాలు ముగియడంతో గురువారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది.