శివ్వంపేట/వెల్దుర్తి/చిన్నశంకరంపేట/మెదక్ రూరల్/ కొల్చారం/రామాయంపేట/, అక్టోబర్ 20: శివ్వంపేటలో కొలువుతీరిన శ్రీబగలాముఖి శక్తిపీఠంలో శుక్రవారం అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం బగలాముఖీ అమ్మవారికి మహాపూజలు, మూలవిరాట్ అమ్మవారికి అభిషేకాలు, ఉత్సవమూర్తులకు అభిషేకాలు, శ్రీసూక్తనామార్చనలే కాకుండా బగలాశాస్త్రంలోని శ్రీసూక్తమంత్రములతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసకులు వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ నేటి (శనివారం) నుంచి మూడు రోజుల పాటు బగలాముఖి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, చివరిరోజు జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమం లో శక్తిపీఠం స్థలదాత పబ్బ రమేశ్ గుప్తా, ట్రస్ట్ సభ్యులు హైకోర్టు న్యాయవాది జిన్నారం పెద్దగౌని శివకుమార్‌గౌడ్, జడ్పీటీసీ పబ్బ మహేశ్ గుప్తా భక్తులు పాల్గొన్నారు.
వెల్దుర్తి, మాసాయిపేట, చిన్నశంకరంపేట, మెదక్ రూర ల్, కొల్చారం, రామాయంపేట మండలాల్లోని పలు గ్రామా ల్లో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారి మండపానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఒడి బియ్యాన్ని సమర్పించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. అంబాజీపేటలో యజ్ఞాన్ని నిర్వహించారు. కొల్చారంలో శివాలయంలో మహిళలు నాణేల పూజలు చేశారు. వరిగుంతంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల యాగంలో జడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోశ్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయంపేట పట్టణంలోని మహంకాళి ఆలయంలో శుక్రవారంఆలయ కమిటీ చైర్మన్ దంపతులు పాండురంగాచారి-వరలక్ష్మి, మాజీ ఎంపీ పీ మోహనాచారి పూజా కార్యక్రమాలను చేపట్టారు. మాజీ ఎంపీపీ సరాఫ్ మోహనాచారి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించి అమ్మవారకి మంగళహారతులు, నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారు సరస్వతిదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పలుచోట్ల అనంతరం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు.
చేగుంట, అక్టోబర్ 20: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు చేగుంట, నార్సింగి మండలాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చేగుంట మండలం చందాయిపేటలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీ గెలువాలని దుర్గమాతకు వద్ద గ్రామ ఉప సర్పంచ్ సంతోశ్‌కుమార్ చేగుం ట మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, ఇబ్రహీంపూర్ మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు శ్రీనివాస్, శివాజీయూత్ సభ్యులు పాల్గొన్నారు.