పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు... బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు.
ఫ్యాషన్ ప్రపంచం రెడ్ కార్పెట్ పరిచే వన్నెల్లో ఊదా ముందు వరుసలో ఉంటుంది. నిండైన రంగూ, ట్రెండీ హంగూ రెండూ ఉంటాయి ఇందులో. అందుకే అతివలు మెచ్చే అన్ని దుస్తుల్లోనూ ఈ వర్ణం వన్నెలీనుతుంది.
నీలవర్ణంలో.. సముద్రమంత గాంభీర్యం, ఆకాశమంత నిగూఢత్వం. నీలం రంగు చీరకట్టులోనూ అంతే మార్మికత. అగాథాన్ని తలపించే ఆమె అంతరంగానికి ఐదున్నర గజాల సాక్షి సంతకం ఈ చీర.
అందమైన ఆభరణాలకు కాలదోషం ఉండదు. తరాలు మారినా ఆదరణ తగ్గదు. కాబట్టే, పాతవే అయినా కొత్త హంగులతో మగువల మనసులు దోచేస్తున్నాయి.. బల్గారీ నగలు. గ్రీస్, ఇటలీ డిజైన్లతో ప్రాణంపోసుకునే ఈ సొమ్ములు ఆధునిక యువతులను భలే�