Stone Jewellery | పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే వాటిని జోడించాల్సిందే!
పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు... బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు.
Stone Jewellery | పసుపు పచ్చటి వన్నెలో మెరిసే పుత్తడికి రంగుల కళ రావాలంటే రాళ్లు జోడీ కావాల్సిందే. అందుకే కెంపులు, పచ్చలు, నీలాలు, పగడాలు… బంగారంలో సింగారంగా ఒదిగిపోతాయి. అయితే, నగకు నగిషీ అద్దడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు. ఇప్పుడు రత్నాలూ ఆ అందాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. డిజైన్లు చెక్కిన రాళ్లు ఇప్పుడు నగల్లో నయా ట్రెండు.

బంగారపు డిజైన్ ఎక్కువగా కనిపించే నగలు ఒకరకం అయితే, రాళ్లు బాగా కనిపించేవి మరో రకం. ఈ రెండో రకంలోనూ పెద్దరాళ్లు పొదిగిన ఆభరణాలను ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటప్పుడు రాయిని సాదాగా ఉంచడం ఎందుకు, దానికీ కాస్త నగిషీ చెక్కితే మరింత అందంగా కనిపిస్తాయి కదా అనుకున్నారు నగల డిజైనర్లు. ఒకప్పుడు రాజులూ, రాణులూ పెటుకున్న తరహాలో పెద్ద రాళ్ల మీద డిజైన్లు చెక్కి వాటిని నగలకు జోడించడం ప్రారంభించారు.

అలా తయారవుతున్నవే ‘కార్వ్డ్ స్టోన్ జువెలరీ’. పువ్వులు, ఆకులతోపాటు విభిన్న డిజైన్లను రాళ్ల మీద చెక్కుతున్నారు. దాని సైజు, ఆకృతిని బట్టి గొలుసులు, దుద్దులు, గాజులు, ఉంగరాల్లో పొదిగి నగల్ని రూపొందిస్తున్నారు. ఇక, వీటిలోనూ అసలైన రత్నాలు, వజ్రాలతో బంగారంలో రూపుదిద్దుకుంటున్న వాటితోపాటు, ఉపరత్నాలతో వెండి నగల్లోనూ, మామూలు రంగు రాళ్లతో ఫ్యాన్సీ వాటిలోనూ ఈ తరహావి వస్తున్నాయి. నగను అందంగానే కాదు, ఆకర్షణీయంగానూ మలచడంలో ఈ రాళ్లు తమకు తామే సాటి అనిపిస్తున్నాయి. కార్వ్డ్ జువెలరీకి మీరు కాన్వాసు కావాలనుకుంటున్నారా… అయితే వీటిపై ఓ లుక్కేయండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

