ఫ్యాషన్ ప్రపంచం రెడ్ కార్పెట్ పరిచే వన్నెల్లో ఊదా ముందు వరుసలో ఉంటుంది. నిండైన రంగూ, ట్రెండీ హంగూ రెండూ ఉంటాయి ఇందులో. అందుకే అతివలు మెచ్చే అన్ని దుస్తుల్లోనూ ఈ వర్ణం వన్నెలీనుతుంది.
చీరలూ అంతకుమించి దీన్ని సొంతం చేసుకుంటాయి. ఇక్కడ తెలుపు, బంగారు రంగుల అంచులతో ముస్తాబయిన వంకాయ రంగు చీర ఆ ఆకర్షణకు సాక్ష్యంగా నిలుస్తున్నది. చందేరీ వస్త్రంతో నేసిన లైట్ వెయిట్ చీరకు బుట్ట చేతుల తెలుపు రంగు జాకెట్ను జోడించారు డిజైనర్. దీంతో ఊదా వర్ణానికి వెన్నెల కాంతి తోడైంది!