ఫ్యాషన్ ప్రపంచం రెడ్ కార్పెట్ పరిచే వన్నెల్లో ఊదా ముందు వరుసలో ఉంటుంది. నిండైన రంగూ, ట్రెండీ హంగూ రెండూ ఉంటాయి ఇందులో. అందుకే అతివలు మెచ్చే అన్ని దుస్తుల్లోనూ ఈ వర్ణం వన్నెలీనుతుంది.
‘నా వల్ల కాదు..’ చీర కట్టుకోమంటే ఈతరం అమ్మాయిలు చెప్పే జవాబు ఇది. కానీ, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చీరలు ఉల్లిపొరలా తేలిగ్గా ఉంటాయి. అమ్మాయిలకు తప్పక నచ్చుతాయి. సంప్రదాయ వేడుకల్లోనే కాకుండా పార్టీలు, ఫంక్షన్లలో