ఉల్లిపొరలా..అల్లుకుంటే!

‘నా వల్ల కాదు..’ చీర కట్టుకోమంటే ఈతరం అమ్మాయిలు చెప్పే జవాబు ఇది. కానీ, ఆర్గాంజా ఫ్యాబ్రిక్ చీరలు ఉల్లిపొరలా తేలిగ్గా ఉంటాయి. అమ్మాయిలకు తప్పక నచ్చుతాయి. సంప్రదాయ వేడుకల్లోనే కాకుండా పార్టీలు, ఫంక్షన్లలోనూ ప్రత్యేకంగా
కనిపించేలా డిజైన్ చేసిన చీరలివి.
పచ్చని చిలుకలా…
ప్యూర్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. లైట్ మెహందీ గ్రీన్ ప్లేన్ చీరకు డోరీ పైపింగ్‌తో సన్నటి బార్డర్ ఇచ్చారు. బ్రెస్ట్ పార్ట్‌లో చీర కలర్లోనే కర్దనాతో మగ్గం వర్క్ చేసి, కొంగుకి అదే కలర్ హ్యాండ్‌మేడ్ డిజైనర్ ఫ్లవర్స్‌ను జత చేశారు. చీరకు నప్పేలా, అదే కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్ హైలైట్ అయ్యింది. కీ హోల్ డిజైన్‌తో మెడ
వరకు కవర్ అయ్యేలా చేసి, ఫ్రిల్స్తో ఫినిష్ చేశారు. కర్దనా మగ్గం వర్క్ చేసిన ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో రఫెల్స్ ఫాలింగ్ ైస్టెల్లో చేతుల్ని డిజైన్ చేశారు.
మోడల్: చైత్రా రాయ్
మబ్బుచాటు జాబిలిలా..
ఈ చీరను లైట్ గ్రీన్ కలర్ ప్లేన్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. ప్లేన్‌గా ఉన్న చీరపై బ్లాక్ డిజైనర్ బ్లౌజ్ ట్రెండీ లుక్ ఇస్తుంది. మబ్బుతెరలాంటి చీర ఫ్యాబ్రిక్‌కి నప్పేలా, బ్లౌజ్‌ను ప్రింటెడ్ షీఫాన్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. బ్లౌజ్‌కి హాఫ్ షోల్డర్ ఇచ్చి ఫ్రీసైజ్ ఫ్లఫ్ఫీ డిజైన్‌లో చేతులు పొడవుగా ఇచ్చారు. షోల్డర్ కట్‌లోనూ పీకోవర్క్తో ఫినిషింగ్ ఇచ్చి ప్రిల్స్ జత చేశారు. చీర కలర్‌కు నప్పేలా బ్లాక్ ఫ్యాబ్రిక్‌పై లైట్ బ్లూ ఫ్లవర్స్ డిజైన్.. బ్లౌజ్‌ను హైలైట్ చేస్తుంది. కొంగుకు పిన్ను పెట్టకుండా ముడి వేయడం మరింత మోడ్రన్ లుక్‌ని ఇస్తుంది.
మోడల్: అశికా శెట్టి
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 7013639335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

