బహుత్ ప్యార్ సే.. బల్గారీ మెరిసే!
అందమైన ఆభరణాలకు కాలదోషం ఉండదు. తరాలు మారినా ఆదరణ తగ్గదు. కాబట్టే, పాతవే అయినా కొత్త హంగులతో మగువల మనసులు దోచేస్తున్నాయి.. బల్గారీ నగలు. గ్రీస్, ఇటలీ డిజైన్లతో ప్రాణంపోసుకునే ఈ సొమ్ములు ఆధునిక యువతులను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నగల ధగధగలేమిటో చూద్దాం..
– నగ ధగలు
అందమైన ఆభరణాలకు కాలదోషం ఉండదు. తరాలు మారినా ఆదరణ తగ్గదు. కాబట్టే, పాతవే అయినా కొత్త హంగులతో మగువల మనసులు దోచేస్తున్నాయి.. బల్గారీ నగలు. గ్రీస్, ఇటలీ డిజైన్లతో ప్రాణంపోసుకునే ఈ సొమ్ములు ఆధునిక యువతులను భలేగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నగల ధగధగలేమిటో చూద్దాం..
కళ్లుచెదిరే ఆభరణాలను మహిళలు ప్రత్యేకంగా అభిమానిస్తారు. వాటికి కాస్తంత ఆధునికత తోడైతే ప్రాణమిస్తారు. కాబట్టే, మగువల అభిరుచికి తగినట్టు ఆభరణాల డిజైన్లు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. పైపై మెరుగులు ఎంత మారినా ప్రతి నగకూ ఓ ఆత్మ ఉంటుంది. అలాంటి ప్రత్యేక డిజైన్లతో రూపొందినవే బల్గారీ ఆభరణాలు. ‘సర్పెంట్ సోల్’ వీటి ప్రత్యేకత. అంటే, ప్రతి నగా సర్పాకృతిని మేళవించుకుని ఉంటుంది.
అలా మొదలైంది..
బల్గారీ ప్రస్థానం ఇటలీలో మొదలైంది. రోమ్కు చెందిన సోటిరియో బల్గారీ అనే స్వర్ణకారుడు 1884లో ఈ సంస్థను స్థాపించారు. మొదట్లో వెండి ఆభరణాలు మాత్రమే తయారు చేసేవారు. క్రమంగా స్వర్ణాభరణాల వ్యాపారంలోకి వచ్చారు. ఈ సంస్థ ప్రాణంపోసే ఆభరణాల్లో రోమ్, ఇటలీ స్మారక చిహ్నాలు, సుప్రసిద్ధ భవనాలు, వాస్తుశిల్పాలు ఇట్టే ఒదిగిపోతాయి. రేఖాగణిత రూపాలూ అందంగా ఇమిడిపోతాయి.
నవరత్నాలతో..
ఈ నగల్లో బంగారం, వెండి తదితర లోహాలకంటే రత్నాలు, రాళ్లకే ప్రాధాన్యం. ఈ సంస్థ నేటికీ చేతితో రూపొందించిన నగలనే అందిస్తున్నది. యంత్రాల సాయం లేకుండా మెరుగుపెట్టిన రాళ్లతో ప్రతి ఆభరణం ప్రత్యేకంగా కనిపించేలా కంఠాభరణాలు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, గాజులు కూడా రాళ్లతో నిండిన సర్పాకృతితో ఆకట్టుకుంటాయి. ఈ నగల్లో రాళ్ల పొందిక క్రమబద్ధంగా ఉండదు. ఒక రంగు పక్కన మరో రంగు, ఒక ఆకారం పక్కన మరో ఆకారం.. దేనికదే వైవిధ్యంగా అనిపిస్తుంది. ఒక చెవికమ్మకు, మరో చెవి కమ్మకు రాళ్ల అమరికలో చాలా తేడా ఉంటుంది. అయితేనేం, చూడ్డానికి రెండూ బావుంటాయి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. పలువురు సెలెబ్రిటీలు వీటికి వీరాభిమానులు. అందాల తార ప్రియాంకా చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

