పింక్ బాల్ గౌన్.. సంధ్యా సమయం తర్వాత జరిగే విందూవినోదాలకు సరైన ఎంపిక. ఆ ఆహార్యంలో అందం ఇనుమడిస్తుంది.
స్త్రీత్వానికి అయస్కాంతత్వం అబ్బుతుంది. అందరి కళ్లూ ఆమె మీదే. వస్త్రంలోని మెత్తదనం కారణంగా సౌకర్యంగా ఉంటుంది. డిజైనింగ్లోని ప్రత్యేకత వల్ల ఉక్కపోత అనిపించదు. ఆ వేళకు తను దేవకన్యే.