లేత మబ్బురంగు డిజిటల్ ప్రింట్ పూల డిజైన్ల స్కర్ట్ మీద.. అదే రంగు పొడుగు చేతుల చొక్కాతో.. వయ్యారంగా నిలుచున్నది ఆషికా రంగనాథ్. చుట్టూ బిగించిన వస్త్రపు బెల్ట్ నాజూకు నడుమును కొలిచే విఫల ప్రయత్నం చేస్తున్నది. మ్యాచింగ్ పాదరక్షలు.. సొగసైన పాదాలకు పహరా కాస్తున్నాయి. పాయింటెడ్ స్టిలెట్టో హీల్స్.. రాయంచ నడకకు కొత్త సోకులు జోడిస్తున్నాయి. పెదాలకు వేసీవేయని రంగు, ముఖాన నవ్వీనవ్వని హంగు.. ఆమె ప్రత్యేకత! ప్రేమికుల దినోత్సవంనాడు ఆమెకెన్ని ప్రతిపాదనలు అందాయన్నది మరో కత!
సి.ఎం. ప్రవీణ్