వరసైన హారం
వజ్రాలు, పోల్కీలు, కుందన్లు పొదిగినవి మొదలు ముత్యాలు, కెంపులు, పచ్చల మేళవింపుగా రూపొందుతున్నవీ ఉన్నాయి.
వరసలంటే తెలుగు వాళ్లకు చాలా ఇష్టం! అది ఆత్మీయతలో అయినా, ఆభరణాల్లో అయినా. అందుకే సరసమైన వరసల్ని అభిమానించినట్టే, వరసల గొలుసుల్నీ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఆభరణాల వంతు. రెండు దొంతుల ‘టూ స్టెప్ హారాలు’ అతివల మనసుపై వల విసురుతున్నాయి. సరికొత్త డిజైన్లతో మగువల మనసులో మరో మెట్టు ఎక్కుతున్నాయి.

హారం.. అంటే హారమే. గొలుసులన్నీ ఒక ఎత్తు. ఇదొక్కటీ ఒక ఎత్తు. చీరకట్టి, బొట్టు పెట్టి నిండుగా అలంకారం పూర్తి చేయాలంటే మెడలో హారం పడాల్సిందే. అభిరుచిని బట్టి పై మెడకు నెక్లెసులు, నల్లపూసల్లాంటివి పెట్టుకున్నా… అసలేవీ పెట్టుకోకపోయినా సరే, కింది వరసలో హారాన్ని మాత్రం ఇష్టంగా ధరించేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే మిగతా ఆభరణాల అవసరం పెద్దగా లేకుండా, ఒక్క హారం వేసుకున్నా సరే మెడకు నిండుదనం వచ్చేలా టూ స్టెప్ హారాలు తయారవుతున్నాయి.

వజ్రాలు, పోల్కీలు, కుందన్లు పొదిగినవి మొదలు ముత్యాలు, కెంపులు, పచ్చల మేళవింపుగా రూపొందుతున్నవీ ఉన్నాయి. నక్షీ, టెంపుల్ జువెలరీలో ఈ తరహా డిజైన్లు అధికం. సాధారణ హారంలాగే వచ్చి కిందివైపు మరో వరస హారం డిజైన్ రావడం లేదా, పూర్తి హారం రెండు వరసల్లో రావడం దీని ప్రత్యేకత. మామూలు హారాలతో పాటు కాసుల హారంలోనూ ఈ ట్రెండ్ నడుస్తున్నది.

పువ్వులూ, లతలతోపాటు నెమళ్లూ, లక్ష్మీదేవి ప్రతిమల డిజైన్లతో సైతం కనువిందు చేస్తున్నాయి. కాసుల పేరును రెండు వరసలుగా రూపొందించి.. పెద్ద లాకెట్ జోడించి.. స్టెప్ కాసుల దండలను తయారు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు హారం కూడా వరసైందన్నమాట!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

