నీలవర్ణంలో.. సముద్రమంత గాంభీర్యం, ఆకాశమంత నిగూఢత్వం. నీలం రంగు చీరకట్టులోనూ అంతే మార్మికత. అగాథాన్ని తలపించే ఆమె అంతరంగానికి ఐదున్నర గజాల సాక్షి సంతకం ఈ చీర.
ఆ బరువైన భావనను మహా సులభంగా వ్యక్తం చేస్తున్నది లైట్ వెయిట్ శారీ. ఫ్లోరల్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్ చీరకు కొత్త అందం తెచ్చింది. జోడీగా స్లీవ్‌లెస్ వెల్వెట్ జాకెట్‌తో అందాల భామ అలంకరణకు పరిపూర్ణత సాధ్యమైంది.