ఎప్పటిలాగానే చికెన్ బిర్యానీ సత్తా చాటుకుంది. అత్యంత ఇష్టమైన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సంస్థ స్విగ్గీ ‘హౌ ఇండియా స్విగ్గుడ్' అనే శీర్శికన రిపోర్టు విడుదల చేసింది.
ఇంటి వంటలో వెరైటీల సంగతేమో గానీ, బయటి నుంచి తెప్పించుకునే ఆహారంలో మాత్రం బిర్యానీ రాజ్యమేలుతున్నది. అందులో చికెన్‌తో దోస్తీ చేసిన ఈ వంటకాన్ని తెగ ఆర్డరిస్తున్నారు భోజన ప్రియులు.
న్యూ ఇయర్ వేళ ఎక్కువ మంది బిర్యానీకే జైకొట్టారు. శనివారం రికార్డుస్థాయిలో 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.