నిమిషానికి.. 21 చికెన్ బిర్యానీలు
ఎప్పటిలాగానే చికెన్ బిర్యానీ సత్తా చాటుకుంది. అత్యంత ఇష్టమైన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సంస్థ స్విగ్గీ ‘హౌ ఇండియా స్విగ్గుడ్' అనే శీర్శికన రిపోర్టు విడుదల చేసింది.
- స్విగ్గీలో.. చికెన్ బిర్యానీ ఆర్డరే టాప్… నివేదిక విడుదల చేసిన స్విగ్గీ
సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ఎప్పటిలాగానే చికెన్ బిర్యానీ సత్తా చాటుకుంది. అత్యంత ఇష్టమైన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. ఆన్లైన్ ఫుడ్ ఆధారిత సంస్థ స్విగ్గీ ‘హౌ ఇండియా స్విగ్గుడ్’ అనే శీర్శికన రిపోర్టు విడుదల చేసింది. ఈ ఏడాది 8.3 కోట్ల ఆర్డర్లతో వరుసగా తొమ్మిదోసారి దేశంలో అత్యంత ఆదరణ పొందిన వంటకంగా బిర్యానీ నిలిచింది. ప్రధానంగా చికెన్ బిర్యానీకి 4.9 కోట్ల ఆర్డర్లు రావడం విశేషం. స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం, బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది.
2024లో 9.7 మిలియన్ల బిర్యానీ ఆర్డర్లతో బిర్యానీ లీడర్ బోర్డులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం, బెంగళూరు 7.7 మిలియన్ల ఆర్డర్లు, చెన్నై 4.6 మిలియన్ల ఆర్డర్లతో ఉన్నాయి. రంజాన్ సందర్భంగా స్విగ్గీలో 6 మిలియన్ ప్లేట్ల బిర్యానీలు ఆర్డర్ చేసినట్టు పేర్కొంది. ఇందులో కూడా హైదరాబద్ టాప్‌లో ఉందని వివరించింది. ఒక్క నగరం నుంచే 10 లక్షల కంటే అధికంగా బిర్యానీ ఆర్డర్లు చేసినట్టు పేర్కొంది. చికెన్, మటన్, పన్నీరు, ఎగ్ తదితర విభిన్న రకాల 15.7 మిలియన్ల బిర్యానీలు హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఉన్నట్టు పేర్కొంది.
ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు వివరించారు. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డర్ వచ్చాయని పేర్కొంది. ఒక వినియోగదారుడు 60 బిర్యానీలను ఆర్డర్ చేయడానికి ఏకంగా రూ.18,840 రూపాయలు వెచ్చించినట్టు పేర్కొన్నారు. అంతే కాదు టీ20 ప్రపంచ కప్ సందర్భంగా 869 వేల చికెన్ బిర్యానీలు ఆర్డర్ వచ్చినట్టు తెలిపింది. అత్యధికంగా చికెన్ షావర్మాలను ఆర్డర్ చేసినట్టు పేర్కొంది. రాత్రిపూట భోజనం చేయడానికి ఒక వినియోగదారుడు ఒకే ఆర్డర్లో 30 బిర్యానీలు ఆర్డర్ చేశాడని వివరించింది. హైదరాబాద్‌లో అల్పాహారం దోసె, బ్రేక్‌ఫాస్ట్‌గా ఉల్లిపాయ దోస అత్యధికంగా ఆర్డర్ వచ్చిందని, ఇది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 17.54 లక్షల దోసెలు నగరవాసులు స్విగ్గీ నుంచి ఆరగించినట్టు తెలిపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

