Anmol Bishnoi | పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) ఎన్ఐఏ కస్టడీ (NIA custody) ని మరో ఏడు రోజులు పొడిగించారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అన్మోల్ బిష్ణోయ్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది. అతనిని అమెరికా డిపోర్ట్ చేయడంతో ఇది సాధ్యమైంది. అన్మోల్ 2022 నుంచి పరారీలో ఉన్నాడు.
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు మంగళవారం భారత్‌కు అప్పగించారు. దీంతో అతడు భారత్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ఆచూకీ చెప్పినవారికి రూ.10 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రకటించింది.