Anmol Bishnoi : పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ (Gangster) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) ఎన్ఐఏ కస్టడీ (NIA custody) ని మరో ఏడు రోజులు పొడిగించారు. ఈ నెల 19న విధించిన 11 రోజుల కస్టడీ గడువు నేటితో ముగియడంతో.. మరో ఏడు రోజులు కస్టడీ పొడిగించారు. అంటే డిసెంబర్ 5 వరకు అన్మోల్ కస్టడీ కొనసాగనుంది.
అయితే భద్రతాకారణాల రీత్యా అన్మోల్ను ఎన్ఐఏ కోర్టుకు తీసుకెళ్లలేదు. అన్మోల్ చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో జడ్జి స్వయంగా ఎన్ఐఏ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లాడు. అక్కడ విచారణ జరిపి ఎన్ఐఏ అధికారుల మేరకు అన్మోల్ కస్టడీని పొడిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో, సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నారు.