Anmol Bishnoi | అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల NIA రిమాండ్
Anmol Bishnoi | అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లర్‌గా, ఆయుధ స్మగ్లర్‌గా పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) కి పాటియాలా కోర్టు (Patiala Court) 11 రోజుల ఎన్ఐఏ రిమాండ్ విధించింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Laurence Bishnoy) సోదరుడైన అన్మోల్ను అమెరికా అధికారులు మంగళవారం డిపోర్ట్ చేసి భారత్‌కు పంపించారు.
Anmol Bishnoi : అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లర్‌గా, ఆయుధ స్మగ్లర్‌గా పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi) కి పాటియాలా కోర్టు (Patiala Court) 11 రోజుల ఎన్ఐఏ రిమాండ్ విధించింది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Laurence Bishnoy) సోదరుడైన అన్మోల్ను అమెరికా అధికారులు మంగళవారం డిపోర్ట్ చేసి భారత్‌కు పంపించారు.
దాంతో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్మోల్ బిష్ణోయ్ దిగగానే ఎన్ఐఏ (NIA) అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం పాటియాలాలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచగా అన్మోల్ బిష్ణోయ్‌కి న్యాయమూర్తి 11 రోజుల రిమాండ్ విధించారు. దాంతో ఈ 11 రోజులపాటు ఎన్ఐఏ అధికారులు సిద్ధిఖీ హత్యపై ఆన్మోల్‌ను విచారించనున్నారు.
మహారాష్ట్రకు చెందిన బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అమెరికాలో ఉన్న అతడిని భారత్‌కు పంపించాలని బాబా సిద్ధిఖీ కుమారుడు అమెరికా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు అక్కడి అధికారులు బిష్ణోయ్‌ని భారత్‌కు అప్పగించారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

