న్యూఢిల్లీ : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అన్మోల్ బిష్ణోయ్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్ట్ చేసింది. అతనిని అమెరికా డిపోర్ట్ చేయడంతో ఇది సాధ్యమైంది. అన్మోల్ 2022 నుంచి పరారీలో ఉన్నాడు.
అన్మోల్ అరెస్ట్‌తో ఇప్పటి వరకు అరెస్టయిన లారెన్స్ గ్యాంగ్ సభ్యుల సంఖ్య 19కి పెరిగింది. అన్మోల్‌పై మన దేశంలో 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య, నటుడు సల్మాన్ ఖాన్ నివాసం బయట కాల్పులు, పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య తదితర కేసులలో అతను నిందితుడు.