న్యూఢిల్లీ: కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు మంగళవారం భారత్‌కు అప్పగించారు. దీంతో అతడు భారత్‌కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పులు, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. అన్మోల్ అప్పగింత ద్వారా ఉత్తర అమెరికా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిష్ణోయ్ ముఠా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు.