Anmol Bishnoi | కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) సోదరుడైన గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ (Anmol Bishnoi)ను ఎన్ఐఏ (NIA) అరెస్ట్ చేసింది. అమెరికాలో ఉంటున్న అన్మోల్ను అక్కడి అధికారులు భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో అతడిని నేడు భారత్‌కు తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌కాగానే ఎన్ఐఏ అతడిని అరెస్ట్ చేసింది. అరెస్టుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నింటినీ అక్కడికక్కడే పూర్తి చేసి అదుపులోకి తీసుకుంది. అతడిని హై సెక్యూరిటీ మధ్య అక్కడి నుంచి తీసుకెళ్లింది.
అన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. అనేక కేసుల్లో అన్మోల్ బిష్ణోయ్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. అతడిపై మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. ఇటీవలే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన ఫైరింగ్ కేసులో ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ అన్మోల్ ప్రధాన నిందితుడు. నకిలీ పాస్పోర్టుతో అతను ఇండియా నుంచి పారిపోయాడు. గత ఏడాది కెన్యాలో అతన్ని గుర్తించారు. ఈ ఏడాది కెనడాలోనూ కనిపించాడతను.
Also Read..
Fidayeen | భారత్‌లో భారీ దాడులకు జైషే ప్లాన్.. ఫిదాయిన్ కోసం ఆన్లైన్లో విరాళాల సేకరణ
Dangerous Stunt | నలుగురూ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా.. నడి రోడ్డుపై ప్రియురాలికి ముద్దులు