Voters List | నేరేడుచర్ల, ఫిబ్రవరి 25 : ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ అవగా.. మరో ఇద్దరు అధికారులను డీపీఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, ఎంపీఓ నరేష్‌తోపాటు (చెన్నాయి పాలెం) క్రింద తండ గ్రామపంచాయతీ కార్యదర్శి బాల సైదులును సస్పెండ్ చేస్తూ అలాగే అక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ కార్యదర్శి ప్రవీణ్‌తోపాటు గతంలో పనిచేసిన విజయలక్ష్మి, జయ్ సన్ రాజ్‌లను డిపిఓ ఆఫీసుకు అటాచ్ చేశారు.
సక్రమంగా ఎంపిక చేయలేదని..
మఠంపల్లి మండలం కింది తండా గ్రామంలో ఓటర్ల జాబితాలో అధికారులు వార్డుల సక్రమంగా ఎంపిక చేయలేదని.. అలాగే పై తండాకు సంబంధించిన 40 ఓట్లను కింది తండా గ్రామంలో చేర్చారని.. కింది తండా గ్రామానికి చెందిన భూక్య బాబురావు నాయక్ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఓటర్ల జాబితాను పరిశీలించాలనీ ఉన్నతాధికారులు మండలాధికారులను ఆదేశించారు. కానీ ఎంపీడీఓ, ఎంపీఓ గ్రామపంచాయతీ కార్యదర్శి అంతా సక్రమంగానే ఉందని అదే ఓటర్ల జాబితాను ఎంపిక చేసి పైకి పంపించారు.
మళ్లీ ఆ గ్రామానికి చెందిన భూక్య బాబురావు నాయక్ అనే వ్యక్తి ఓటర్ల జాబితాను మార్పు చేయకుండా అలాగే ఫైనల్ లిస్ట్ చేశారని, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఎలక్షన్ కమిషనర్ సీరియస్‌గా తీసుకొని విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు మఠంపల్లి మండలం ఎంపీడీవో, ఎంపీఓ, కింది తండా గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!