Dharmika Parishad | దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేందర్ శర్మ డిమాండ్ చేశారు. ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపేందర్ శర్మ మాట్లాడుతూ..
ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది.. కానీ అధికారులు తమ పెత్తనం పోతుందని సరైన నివేదికలు పంపడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అర్చక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి రూ.70 కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు.
అర్చకుల పిల్లల వివాహాలకు, గృహ నిర్మాణాలకు అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉండగా.. అలా చేయడం లేదన్నారు. అర్చకులకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్.. ప్రతి అర్చకుడికి కేటాయించాలని అన్నారు. అర్చకుల సమస్యలపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అర్చకులపై సవతి ప్రేమ చూపుతున్నారని అన్నారు.
577 జీవో కింద 5666 మంది అర్చకులకు గ్రాంట్ ద్వారా వేతనాలు అమలు చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా గ్రామీణ ధూప దీప నైవేద్య అర్చకులకు 12 వేల రూపాయల వేతనం అమలు చేయడం లేదన్నారు. గ్రామీణ అర్చకులకు స్కీం అనే పదాన్ని వెంటనే తొలగించాలని అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెలంగాణకు రూ.1600 కోట్లు రావాల్సి ఉందని.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తే అర్చకుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఆస్థాన సిద్ధాంతి అవసరాల ప్రసాద్ శర్మ, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు వలివేటి వీరభద్ర శర్మ, సాగర్ శర్మ, సతీష్ తదితరులు ఉన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు