CM Revanth Reddy | సూర్యాపేట, ఫిబ్రవరి 1 : సిట్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించడం కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ పెరుమాళ్ల సతీష్ అన్నారు. ఈ రోజు పాలకీడు మండలం మహంకాళి గూడెం గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పదేళ్లలో అన్ని రంగాలలో తెలంగాణ స్థానాన్ని నెంబర్ వన్ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ పేరుతో విచారించడాన్నితీవ్రంగా ఖండించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలు ఆ హామీలను అమలు చేయమని ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ సిట్ అని.. ఈ ఫార్ములా రేసింగ్ అని అబద్ధపు విచారణలు చేయిస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.
జనవరి నెల పూర్తి అవుతున్నా కూడా రైతులకు అందాల్సిన రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు వేయకుండా పబ్బం గడుపుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మాట్లాడుతుంటే.. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పరువు పోతుందని ఇలా దొంగ విచారణలు చేయిస్తున్నాడు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు చాలా చైతన్యవంతులు మీ కల్లబొల్లి మాటలు అన్నిటికీ కూడా త్వరలోనే సమాధానం చెప్పే రోజు వస్తుందని ఎదురుచూస్తున్నారు అని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పల్లెపంగ నాగరాజు రామ సైదులు కరుణాకర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
