Maddur Municipality | కేసీఆర్ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ విచారణకు నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్కు నోటీసులను నిరసిస్తూ మద్దూరు మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. బైక్ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ కార్యకర్తల బైక్ ర్యాలీతో మద్దూర్ మున్సిపాలిటీ గులాబీమయమైంది.
ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇలాకా కొడంగల్లో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని అన్నారు. పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ను సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ జోలికొస్తే రేవంత్ రెడ్డిని,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు కొడంగల్ సిద్ధంగా ఉందని తెలిపారు.

Maddur2

Maddur3

Maddur4