Talasani Srinivas Yadav | కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. 160 సీఆర్పీసీ నోటీసులను తుంగలో తొక్కేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామాలు ఆడుతోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీఆర్ఎస్పై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తలొగ్గేది లేదని.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి నల్ల బ్యాడ్జీలు, నల్లజెండాలతో బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సిట్ నోటీసులు, విచారణ అంతా డ్రామా అని అన్నారు. కేసులో పసలేకనే రెండేళ్లుగా సాగదీస్తున్నారని విమర్శించారు.