‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు.
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.