Tejas Nandlal Pawar | నూతనకల్, మార్చి 5 : నర్సరీతోపాటు పల్లె ప్రకృతి వనాల్లో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అధికారులకు సూచించారు. ఇవాళ మండల కేంద్రంలోని వన నర్సరీ, పల్లె ప్రకృతి ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి నుండి మొక్కలని కాపాడాలని అన్నారు. ఉపాధి హామీ పని కోరిన ప్రతీ ఒక్కరికి పని కల్పించే బాధ్యత ఉపాధి సిబ్బందికి ఉందన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మండల కేంద్రంలోని వాహనాలు నడవని ప్రదేశంలో జరుగుతున్న ఉపాధి పనులను మోటార్ సైకిల్‌పై వెళ్లి పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్వరలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలలో బాగా రాసి.. జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు లక్ష్యసాధనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన అన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో సునీత, ఎంఈఓ రాములు నాయక్ తదితరులున్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు