కోదాడ: కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి వరిసాగు చేస్తున్న రైతన్నలకు కన్నీరే దిక్కయింది. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీళ్లు వదలకపోవడంతో సాగునీరు అందక పొట్ట దశకు వచ్చిన పంట కండ్లముందే ఎండిపోయింది. దీంతో చేసేదేంలేక ఇన్నిరోజులు కష్టపడి సాగుచేసిన వరి పంటను గొర్ల మందకు మేతగా వదిలేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆయకట్టు చివరి భూములు కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా విడుదలైన నీటితో వేలాది ఎకరాలు సిరుల పంటలు పండాయి. అప్పుడు అధికారులు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు ముందస్తు జాగ్రత్త తో రైతులకు సకాలంలో సాగునీరు అందించారు. దీంతో కోదాడ (Kodada) నియోజకవర్గంలో ఆయకట్టు చివరి ప్రాంతాలైన మోతే నడిగూడెం, మునగాల మండలాల్లో వరి రెండు పంటలతో రైతులకు ఆర్థిక పరిపుష్టి కలిగి ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత చర్యలు, అలసత్వం, నిర్లక్ష్యం వల్ల మోతే, మునగాల, నడిగూడెం మండలాల్లో 5 ఎకరాల్లో ఏపుగా పెరిగిన వరి పంట సాగునీరు అందక పోవడంతో ఎండిపోవడంతో పశువులను గొర్రెలను నేపాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అధికారులు తమకు సకాలంలో అవసరమైనప్పుడు నీరందిస్తామని భరోసా ఇవ్వటం వల్లే వరిపెట్టవేశామని అయితే పొట్ట కొచ్చే దశలో సాగునీరు అందించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతరమవుతున్నారు.
మునగాల మండలం నేలమరి రెవెన్యూ పరిధిలో నేలమర్రి ఈదుల వాగు తండా మరిసికుంట తాడువాయి రెవెన్యూ పరిధిలో వెంకటాపురం తదితర గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా వరి పంట పశువుల పాలైంది.. ఎస్సారెస్పీ నుంచి నీ రందకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా పనిచేయని స్థితి.. ఇక మోతే మండలంలోమోతే మండలంలో బళ్ళు తండా, లాల్ తండా ,చిన్నరాజు తండా, సిరికొండ, మోతే ,భిక్య తండా, రావిపాడు, మామిల్లగూడెం, తుమ్మలపల్లి ,కొత్తగూడెం, ఇబలాపురం, రాంపురం తండా, గోల్ తండా, సర్వారం, హుస్నాబాద్ గ్రామాలలో నాలుగు వేల ఎకరాలకు పైగా పంట ఎండింది.
మునగాల మండలం నేలమరి రెవెన్యూ పరిధిలో నేలమర్రి ఈదుల వాగు తండా మరిసికుంట తాడువాయి రెవెన్యూ పరిధిలో వెంకటాపురం తదితర గ్రామాల్లో 1000 ఎకరాలకు పైగా వరి పంట పశువుల పాలైంది.. ఎస్సారెస్పీ నుంచి నీ రందకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా పనిచేయని స్థితి.. ఇక మోతే మండలంలోమోతే మండలంలో బళ్ళు తండా, లాల్ తండా ,చిన్నరాజు తండా, సిరికొండ, మోతే ,భిక్య తండా, రావిపాడు, మామిల్లగూడెం, తుమ్మలపల్లి ,కొత్తగూడెం, ఇబలాపురం, రాంపురం తండా, గోల్ తండా, సర్వారం, హుస్నాబాద్ గ్రామాలలో నాలుగు వేల ఎకరాలకు పైగా పంట ఎండింది. గత నాలుగు రోజులుగా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గొల్ల మల్లయ్య యాదవ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగు లింగ యాదవులు ఎండిన పంటలు పరిశీలించి రైతుల ఓదార్చడంతోపాటు ఎండిన ఎస్సారెస్పీ కాలువల వద్ద రైతులతో కలిసి తమ నిరసన తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మి మోసపోయా: రైతు బానోత్ హరియా
నాకు 9 ఎకరాల పొలంతో పాటు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది.. కాలవ నీళ్లు రాక పూర్తిగా వరి పంట ఎండిపోయింది బావులు బోర్లలో కూడా నీళ్లు అడిగింటి పోయాయి.. ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు వస్తాయని వరి వేశాను.. నీళ్లు రాకపోవడంతో వరి పొలం మొత్తం ఎండిపోయింది… అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన…. కాంగ్రెస్ నాయకులు అధికారులు నీళ్లు ఇస్తామంటేనే వరి వేష.. వరి పోతే పోయింది ఇప్పటికైనా నీళ్లు ఇస్తే మామిడి తోటనైనా కాపాడుకోవచ్చు.. కెసిఆర్ ప్రభుత్వంలో రెండు పంటలకు నీళ్లు వచ్చి ఆనందంగా ఉన్నాం.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు.