సూర్యాపేట అర్బన్ మార్చి 2: జనవిజ్ఞాన వేదిక (JVV), సూర్యాపేట సైన్స్ ఫోరం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్టు బహుమతుల ప్రధానోత్సవాన్ని ఎస్వీ కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గోళ్ళమూడి రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుండి ప్రభుత్వ, ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలలలోని ఆరు నుండి పదవ తరగతులకు చెందిన 562 మంది విద్యార్థులు ఈ టెస్ట్ కు హాజరయ్యారని తెలిపారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జీవ పరిణామ సిద్ధాంతం అవశ్యకతను జెవివి రాష్ట్ర బాధ్యులు పి.వి దుర్గాప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్ తాటి చంద్రశేఖర్, రాష్ట్ర బాధ్యులు షేక్ జాఫర్, సీనియర్ నాయకులు వల్లపట్ల దయానంద్, తల్లాడ రామచంద్రయ్య, మారం నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు దేవరశెట్టి నాగరాజు, సునీత, అంకెల మామయ్య చంద్రయ్య, సురేష్ కుమార్, కృష్ణయ్య, క్రాంతి కుమార్, మురళీకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.