మేళ్లచెర్వు, ఆగష్టు 17 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేష్ యాదవ్ ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. గతంలో జరిగిన నేషనల్ చాంపియన్‌షిప్ ఆధారంగా తనను ఈ పోటీలకు ఎంపిక చేసినట్లు నరేష్ ఆదివారం తెలిపారు. కాగా, 2014లో చైనాలో జరిగిన పారా ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని భారతదేశాన్ని రెండో స్థానంలో నిలిపాడు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్‌ను బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Kangana Ranaut | వాళ్లంతా మర్యాద లేనివాళ్లే.. ఆ హీరోలపై కంగనా వ్యాఖ్యలు
Brain Infection | అరుదైన మెదడు వాపు వ్యాధితో తొమ్మిదేండ్ల బాలిక మృతి