Meenakshi Chaudhary | టాలీవుడ్లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కథానాయికల్లో మీనాక్షీ చౌదరీ పేరు ముందు వరుసలో ఉంది. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ… దక్షిణాది ఇండస్ట్రీలలో ‘లక్కీ ఛార్మ్’గా మారిపోయింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఐదేళ్లే అయినా, మీనాక్షీ చౌదరీ పేరు ఇప్పుడు టాప్ హీరోయిన్ల సరసన వినిపిస్తోంది. మొదట అక్కినేని సుశాంత్‌తో చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ‘ఖిలాడీ’ లో నటించింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఫలించకపోయినా, ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెను అగ్రనాయికల సరసన నిలబెట్టాయి.
లక్కీ భాస్కర్ సినిమాలో ‘సుమతి’ పాత్రలో నటించి మెప్పించింది. సినిమా భారీ హిట్ కాకపోయినా, మీనాక్షీకి మాత్రం అది మైలురాయి లాంటిది అని చెప్పాలి. ఆ తర్వాత గుంటూరు కారం, విజయ్ తలపతి నటించిన గోట్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుసగా మూడు భారీ విజయాలు సాధించింది.లక్కీ భాస్కర్ ₹100 కోట్లు రాబట్టగా, గోట్ ₹450 కోట్లు, సంక్రాంతికి వస్తున్నాం ₹300 కోట్లుకి పైగానే వసూళ్లు రాబట్టింది. మొత్తానికి మీనాక్షి నటించిన ఈ మూడు సినిమాలు దాదాపు 800 కోట్లకి పైగా కలెక్ట్ చేయడం విశేషం. ఇక మీనాక్షి ఇటీవల తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇంగ్లీష్‌లో ‘Meenakshi’గా ఉండే పేరులో, అదనంగా ఒక ‘A’ జోడించి ‘Meenaakshi’గా మార్చుకుంది. ఈ మార్పు వెనుక కారణం కెరీర్ లో ఎదగడం కోసమా లేకుంటే ఆధ్యాత్మిక విశ్వాసమా? లేక న్యూమరాలజీ ప్రభావమా అన్నది స్పష్టంగా తెలియదు.
ఆ మధ్య వరసగా సినిమాలు చేసిన మీనాక్షి చౌదరి.. కొన్ని నెలలుగా సందడి చేయడం లేదు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాతో పాటు.. అనగనగా ఒకరాజులో చిత్రంలో నటిస్తుంది మీనాక్షి. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ షో చేస్తూ నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్టు, సాయంత్రం నక్షత్రాల మధ్య ఉన్నట్టు అనిపించిందని మీనాక్షి కామెంట్ చేసింది.