సూర్యాపేట, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ‘సూర్యాపేటలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కాదనలేం.. ఒకవేళ రాజకీయ పరంగా విమర్శిద్దామన్నా జనం అంగీకరించే పరిస్థితి లేదు.. నియోజకవర్గం మొత్తం తన కుటుంబంగా భావిస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఊరూవాడలను అభివృద్ధి చేస్తూ రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. సూర్యాపేటలో ప్రతిపక్షానికి పని లేకుండా చేస్తున్నారు. అభివృద్ధి ఈ స్థాయిలో జరుగుతున్నప్పుడు ఇతర పార్టీల్లో ఉండేకంటే బీఆర్ఎస్ వెంట అడుగులు వేయడం సబబు’ అని బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
బీజేపీకి రాజీనామా చేసి త్వరలోనే తన అనుచరులతో పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పని హామీలను కూడా అమలు చేసి చూపిస్తున్న ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తనకు ఓట్లు ముఖ్యం కాదని, సూర్యాపేట అభివృద్ధి ప్రధానమని భావించి మంత్రి రోడ్ల వెడల్పునకు పూనుకొని సూర్యాపేటను అభివృద్ధి పథంలోనడిపిస్తున్నారని తెలిపారు.
కండ్లకు కనబడుతున్న అభివృద్ధిని కాదనలేమని, మూసీ మురికి కూపం నుంచి విముక్తి కల్పించి స్వచ్ఛమైన జలాలను అందించిన ఘనత జగదీశ్రెడ్డిదేనని చెప్పారు. ప్రతి మండలంలో చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు అందించి సస్యశ్యామలం చేశారన్నా రు. సూర్యాపేట నియోజకవర్గంలో ఎంతోమం ది శాసనసభ్యులు పనిచేసినా కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తేలకపోయారని, కానీ ఎవరూ ఊహించని విధంగా మెడికల్ కాలేజీని తెచ్చిన ఘనత జగదీశ్రెడ్డిదేనని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైన సద్దుల చెరువును ఇప్పటికే మినీట్యాంక్‌బండ్‌గా మార్చగా పుల్లారెడ్డి చెరువునూ అదేతీరులో తీర్చిదిద్దుతున్నారన్నారు.
ఏ ఊరు వెళ్లి నా, ఏ తండా వెళ్లినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయని చెప్పారు. 20 14కు ముందు ఏ పేదవానికి జబ్బు చేసినా బిల్లు లు కట్టలేక దీనావస్థలో ఉండేవారని, జగదీశ్‌రెడ్డి పుణ్యమా అని ఎంత ఖరీదైన వైద్యమైనా తమ కుటుంబ పెద్ద జగదీశ్‌రెడ్డి ఉన్నాడ ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉన్నారన్నారు. కోట్ల రూపాయలతో పేదవాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యాన్ని అం దిస్తున్న ఘనత మంత్రిదేనని తెలిపారు. త్వరలో మంత్రి సమక్షంలో తన కార్యకర్తలతోపాటు బీఆర్ఎస్లో చేరుతానని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రాపర్తి రమే శ్, బీజేపీ యువమో ర్చా పట్టణ ఉపాధ్యక్షుడు కక్కిరేణి ఆనంద్, పట్టణ బీజేపీ నాయకులు రాపర్తి మహేశ్, కక్కిరేణి శివకుమార్, రాపర్తి సంజయ్, గుండగాని కుమార్ పాల్గొన్నారు.